పూరిః జగన్నాథుని ఆలయం ఆవరణలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రేకుల షెడ్డు, ఐదు క్వింటళ్ల వంటచెరుకు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తేగలిగారు.
స్వామివారి ప్రసాదం తయారు చేసే ఆలయం వంటగది పక్కనే మేఘనాథ్ పచేరి వద్ద 25 లారీల వంటచెరుకు నిల్వవుంచారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగిన విషయం గమనించిన ఆలయ సిబ్బంది అగ్నిమాపక దళాన్ని అప్రమత్తం చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయకుంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా వుండేది. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక విద్రోహం దీనికి కారణమా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.