హైదరాబాద్:
హైదరాబాద్‌లో
ఆస్తి
పన్ను
పెంచబోమని
తెలుగుదేశం
హైదరాబాద్
మేయర్
అభ్యర్థి
తీగల
కృష్ణా
రెడ్డి
హామీ
ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వర్కింగ్
జర్నలిస్టుల
యూనియన్
(ఎపియుడబ్ల్యుజె)
ఏర్పాటు
చేసిన
మీట్
ది
ప్రెస్
కార్యక్రమంలో
ఆయన
మాట్లాడారు.
విద్యుత్
ఛార్జీలు,
ఆస్తి
పన్నులను
రాష్ట్ర
ప్రభుత్వం
పెంచబోతుందని
ప్రతిపక్షాలు
చేస్తున్న
విమర్శల్లో
నిజం
లేదని
ఆయన
అన్నారు.
ఈ
విమర్శలు
తమకు
ప్రతికూలం
కాదని
ఆయన
అన్నారు.
ఎన్నికల్లో
తన
విజయం
ఖాయమని
ఆయన
ధీమా
వ్యక్తం
చేశారు.
మజ్లీస్
ప్రజా
వ్యతిరేక
విధానాలే
తన
విజయానికి
తోడ్పడుతాయని
ఆయన
అన్నారు.
ఆస్తిపన్ను
ఇతర
మున్సిపాలిటీల్లో
కన్నా
తక్కువగా
ఉన్నదని,
కరెంట్
ఛార్జీల
పెంపు
పేదలకు
భారం
కాకుండా
చూస్తామని
ఆయన
చెప్పారు.