కోల్‌కత్తా:
టెలిఫోన్
కాల్స్,
రెంటల్
ఛార్జీలు
త్వరలో
పెరుగుతాయి.
కొత్త
టారిఫ్‌లో
ఛార్జీలు
కనీసం
15
శాతమైనా
పెరుగుతాయని
టెలిఫోన్
రెగ్యులేటరీ
అథారిటీ
ఆఫ్
ఇండియా
(ట్రాయ్)
ఛైర్మన్
ఎం.ఎస్.
వర్మ
తెలిపారు.
సవరించిన
టారిఫ్
ఏప్రిల్
నుంచి
అమల్లోకి
వస్తుందని
ఆయన
చెప్పారు.
యాక్సెస్
ప్రొవైడర్లు,
నేషనల్
లాంగ్
డిస్టెన్స్
ఆపరేటర్ల
మధ్య
ఇంటర్
కనెక్టింగ్‌కు
సంబంధించి
మంగళవారం
ఇక్కడ
జరిగిన
బహిరంగ
సదస్సును
ఆయన
ప్రారంభించారు.
అనంతరం
ఆయన
విలేకరులతో
మాట్లాడారు.
ఇటీవల
లాంగ్
డిస్టెన్స్
కాల్స్
ఛార్జీలు
తగ్గించడం
వల్ల
బిఎస్‌ఎన్‌ఎల్‌కు
ఎదురయ్యే
నష్టం,
కాల్స్
సంఖ్య
పెరగడం
వల్ల
వచ్చే
ఆదాయంతో
పూడిపోతుందని
ఆయన
చెప్పారు.
ఐఎస్‌డి
ఛార్జీలు
కూడా
త్వరలో
తగ్గుతాయని
ఆయన
చెప్పారు.