విజయం చే జారదు

హైదరాబాద్‌ః స్వేచ్ఛగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు రెండో రోజు కూడా ఆయన హైదరాబాద్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీపై ఆయన తనదైన శైలిలో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. 44 వేల కోట్ల రూపాయలు రుణంగా తెచ్చిన చంద్రబాబు ఈ డబ్బును వెచ్చించి చేసిన అభివృద్ధి గురించి వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించారో చెప్పాలని ఆయన అన్నారు. పేదలు, నిరుద్యోగుల స్థితిగతుల్లో ఏ మాత్రం మార్పు లేదని ఆయన విమర్శించారు.

జంటనగరాల్లో 100 పైగా మురికివాడలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వున్నాయని ఆయన చెప్పారు. అసిఫ్‌నగర్‌, మలక్‌పేట, మహరాజ్‌గంజ్‌ ప్రాంతాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యటనకు మంచి ప్రతిస్పందన లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం కోసం అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతున్నదని వైఎస్‌ ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం నేత చెబుతున్న అభివృద్ధి సంపన్న వర్గాలకు మాత్రమే లాభం చేసిందని పేదలకు, బడుగువర్గాలకోసం జరిగిన అభివృద్ధి ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలను సవ్యంగా జరగకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకోకుంటే ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఆయన చెప్పారు. వైఎస్‌ వెంట కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌ ఇతర సీనియర్‌ నేతలు వున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+