పాట్నాః నవడా జిల్లా లో ముఖియా పదవికి పోటీ చేస్తున్న అభ్యర్ధి మద్దతుదారు హత్య కేసులో బీహార్ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఆదిత్య సింగ్ను శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
ముఖియా మద్దతు దారు హత్యతో ఆ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా తయారయింది. ఈ ఎన్నికల్లో మంత్రిఅర్ధాంగి కూడా పోటీపడుతున్నారు. మంత్రి కొడుకుకు హత్యతో ప్రత్యక్ష్య ప్రమేయం వున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. దాంతో వెంటనే మంత్రి ఇంటిపై దాడిచేలి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.