బీజింగ్ః చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కోసం కొనుగోలు చేసిన బోయింగ్ 767 ప్రత్యేక విమానంలో అమెరికా గూఢచర్య పరికరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడికావడంతో ఈ వ్యవహరం పై తీవ్రదుమారం చెలరేగే అవకాశం కనిపిస్తున్నది.
చైనా అధ్యక్షునితో శిఖరాగ్ర సమావేశానికి అమెరిక నేత బుష్ వచ్చే నెల బీజింగ్ రానున్న నేపథ్యంలో వెల్లడయిన ఈ సమాచారం అమెరికాను తీవ్ర ఇరకాటంలోపెట్టింది. అమెరికాలో తయారయిన బోయింగ్‌లో 20స్పైయింగ్ బగ్స్‌ను ఏర్పాటు చేసినట్టు చైనా చెబుతున్నది. అత్యాధునికమైన ఈ బగ్స్ వల్లవిమానంలో మాట్లాడే ప్రతిమాట అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల చెవినపడుతుంది. చైనా అగ్రనేత ఈ బగ్స్విషయం బయటపడిన తర్వాత తీవ్రంగా మండిపడినట్టుగా తెలిసింది. ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న అమెరికా చైనా సంబంధాలు ఈ సంఘటన వల్ల మరింత దిగజారే అవకాశం వున్నదనిఅంటున్నారు.