వాషింగ్టన్‌ః భారత సరిహద్దుల్లో మొహరించిన సైనిక బలగాలను ఉపసంహరించే ఉద్దేశ్యం లేదని రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తేల్చిచెప్పారు. తమదేశంలో తలదాచుకున్న నేరగాళ్లను భారత్‌కు అప్పగించాలని పాక్‌ను ఆయన డిమాండ్ చేశారు.
సీమాంతర ఉగ్రవాదానికి వెంటనేస్వస్తి చెప్పాలని ఆయన కోరారు. ఈ రెండు డిమాండ్లను పాకిస్తాన్ ఆమలుచేస్తే తప్ప సరిహద్దుల్లోంచిసైనిక దళాలను ఉపసంహరించేది లేదని వాషింగ్టన్‌లోవిలేకరులతో మాట్లాడుతూ జార్జ్ చెప్పారు. పాకిస్తాన్ తమదేశంలో చిచ్చుపెడుతున్నదని అలాంటి సమయంలో పాక్ కల్లిబొల్లి మాటలను నమ్మిసైన్యాన్ని వెనక్కి రప్పిస్తే అది భారత్ ప్రయోజనాలకేదెబ్బఅని ఆయన చెప్పారు. దౌత్య మార్గంలోపాక్‌పై వత్తిడి కొనసాగుతునే వున్నదని అయితే అది ఎప్పటివరకు ఫలిస్తుందో వేచిచూడాలని ఆయన అన్నారు.