హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఫా ఫెమినా అందాల పోటీల్లో న్యూఢిల్లీకి చెందిన నేహ మిస్‌ఇండియా-యూనివర్స్‌గా ఎంపికయ్యారు.
తర్వాత స్థానంలోముంబాయికి చెందిన శృతి మిస్ ఇండియా-వరల్డ్‌గాకల్‌కొతాకు చెందిన రేష్మి మిస్ ఇండియా-ఎర్త్‌గాఅందాల కిరీటాలను సొంతం చేసుకున్నారు. 21 ఏళ్లనేహ ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కళాశాలనుంచి డిగ్రీ పొందారు.న్యాయనిర్ణేతలనుపోటీలో పాల్గొంటున్నవారు ప్రశ్న అడగాల్సిన అవకాశంవచ్చినప్పుడు, ప్రపంచమంతా శాంతినికోరుకుంటున్న సమయంలో భారత్, పాకిస్తాన్‌యుద్ధానికి దిగడం ఎంతవరకు సమంజసమనేప్రశ్న వేయడం పోటీలో నేహ అవకాశాలనుబాగా ప్రభావితం చేసింది. మదాపూర్ హైటెక్‌సిటీ సమీపంలోని నాక్ మైదానంలో ఆహ్లాదకరమైనవాతావరణంలో ఈ పోటీలు జరిగాయి. అందాల పోటీలనిర్వహణలో తనకంటూ ఒక ప్రత్యేకతనుసంపాదించుకున్న ఫెమినా పత్రిక తొలిరెండు రౌండ్లనువేరు వేరు ప్రాంతాల్లో నిర్వహించి తుది పోటీలనుహైదరాబాద్‌లో నిర్వహించడం విశేషం.