బెంగుళూరుః
తనపై
హత్యా
యత్నం
జరిగిందంటూ
పత్రికల్లో
వచ్చిన
వార్తలపై
సత్యసాయిబాబా
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
సత్యసాయి
సూపర్
స్పెషాలిటీస్
ఆస్పత్రి
తొలివార్షికోత్సవ
కార్యక్రమంలో
ప్రసంగించిన
సాయి
తనపై
హత్యాయత్నం
జరగలేదని
స్పష్టం
చేశారు.
హత్యాయత్నం
వార్త
పూర్తిగా
మీడియా
సృష్టీకరణ
అని
తప్పుడు
వార్తలు
రాసినందుకు
విలేకరులు
జన్మజన్మలకూ
పాపంలో
పడిపోతారని
సాయి
శపించారు.
వాస్తవాలను
తెలుసుకోకుండా
గోరంతను
కొండంతలుగా
చేశారని
ఆయన
చెప్పారు.
అసత్య
ప్రచారం
వల్ల
దేశదేశాలనుంచి
తన
క్షేమాన్ని
వాకబు
చేస్తూ
టెలిగ్రాములు
వచ్చాయని
ఆయన
తెలిపారు.
అయితే
తాను
ఎవర్నీ
ద్వేషించననిఅందర్నీ
ప్రేమిస్తానని
శాపానికి
ఉపసంహారం
కూడా
సాయి
ఇచ్చారు.
పత్రికలు
పోలీసులు
నమోదు
చేసిన
కేసు
ఆధారంగానే
వార్తలు
రాసినప్పటికీ
సాయి
ఈ
విధంగా
విరుచుకుపడటం
గమనార్హం.
వైట్‌ఫీల్డ్‌లో
జరిగిన
సాయి
సూపర్‌స్పెషాల్టీ
ఆస్పత్రి
వార్షికోత్సవంలో
కర్ణాటక
ముఖ్యమంత్రి
ఎస్‌ఎం
కృష్ణ,
ప్రముఖ
శాస్త్రవేత్త
అబ్దుల్
కలామ్
ఆజాద్
పాల్గొన్నారు.