పాక్ ఆక్రమిత కాశ్మీరూ మాదే: జస్వంత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ తమదేనని భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా గుర్తించాలనే సూచనలను ఆయన సోమవారం తిరస్కరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో సహా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమంతా భారత్‌లో అంతర్భాగమేనని 1994లో పార్లమెంటు చేసిన తీర్మానానికి కట్టుబడి వుంటామని ఆయన స్పష్టం చేశారు.
కాశ్మీర్ సమస్యలో పాకిస్థాన్ పాత్ర పోషించాల్సిన విషయం గురించి ప్రస్తావించగాఇరవై యేళ్ల క్రితం జనరల్ జియా వుల్ హక్ ప్రారంభించిన సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌స్వస్తి చెప్పాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడుకోవడం మానాలని ఆయన అన్నారు.
దేశం మరోసారి విభజనకు గురికాదని ఆయన అన్నారు. 1972 సివ్లూ ఒప్పందాన్ని గుర్తు చేస్తూ హింసాయుత పద్ధతుల ద్వారా నియంత్రణ రేఖను మార్చడం కుదరదని జస్వంత్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications
