అమెరికాసెంటర్ పై తీవ్రవాదుల దాడి
కోల్ కతాః కోల్ కతా లోని జవహర్ లాల్ నెహ్రూ రోడ్ లో వున్న యునైటెడ్‌స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కేంద్రంపై మంగళవారం తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇన్ఫర్మేషన్ కేంద్రంలో నిలుచొని వున్న 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 12మంది భద్రతా సిబ్బంది వున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
అమెరికా ఇన్ఫర్మేషన్ సెంటర్ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా వున్న అమెరికా కార్యాలయాలవద్ద భద్రతనుపెంచారు. ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications
