అస్సాంలో 16 మంది కాల్చివేత
అస్సాంః అస్సాంలో బోడో తీవ్రవాదులు మరో సారి పంజావిసిరారు. అస్సాం లోని దరాంగ్ జిల్లా జంగల్ బరి గ్రామంలో 16 మంది బీహారీ కూలీలనుమిలిటెంట్లు కాల్చి చంపారు. కూలీలు నివసించే ఇళ్ళను కూడా బోడోమిలిటెంట్లు తగలబెట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటలో మరో ఐదుగురు గాయపడ్డారు. కొంతకాలంగా మౌనంగా వున్న బోడో గత వారం రోజుల్లో నరమేధం సృష్టించడం ఇది రెండోసారి. బోడో తీవ్రవాదులు తమ ఉనికిని చాటుకొనేందుకే ఈ హింసాకాండ సృష్టిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
