వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా సెంటర్ పై దాడిదారుణంఃబుష్
వాషింగ్టన్‌ః కోల్ కతా లోని అమెరికన్ ఇన్ఫర్మేషన్‌సెంటర్ పై టెర్రరిస్టులు జరిపిన దాడిని అమెరికా అధ్యక్షుడు బుష్ ఖండించారు. ప్రపంచప్రజానీకం ప్రాణాలకు ముప్పుతెస్తున్న తీవ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు అన్ని దేశాలూ కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ వర్జీనియా పర్యటనలో వున్న బుష్‌విలేకరులతో మాట్లాడుతూ కోల్ కతాలో జరిగిన దాడిలో అమెరికన్లు ఎవరూ మరణించపోయినా, గాయపడకపోయినా.... ఈ దాడి లక్ష్యం అమెరికాయేనని అన్నారు.
ఈ దుర్ఘటన గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు ఆయనవివరించారు. టెర్రరిస్టులు అమెరికా మీద దాడి చేశారా లేక మరోదేశంమీద దాడి చేశారా అన్నది ప్రశ్న కాదా టెర్రరిజాన్ని ఎలా నిర్మూలించాలన్నదే మన ముందున్న ప్రధాన సవాల్ అని బుష్ అన్నారు.
Comments
Story first published: Wednesday, January 23, 2002, 23:53 [IST]