వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

ఐఎస్‌ఐకి సంబంధం లేదుః పాక్
ఇస్లామాబాద్‌ః కోల్ కతా లోని అమెరికా సమాచార కేంద్రంపై జరిగిన దాడితో ఐఎస్‌ఐకి ఏ మాత్రం సంబంధం లేదని పాకి ప్రభుత్వం స్పష్టం చేసింది. కోల్ కతా లోని అమెరికా కేంద్రంపై ఓదాడి జరిపినట్లు భావిస్తున్నఫర్హాన్ కు కొందరు పాక్ ఏజెంట్లతో సంబంధం వున్నదని, ఆ ఏజెంట్లకు పాక్ గూఢచారి సంస్థ ఐ.ఎస్.ఐ.తో సంబంధాలున్నాయని భారత హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ ఆరోపించారు. ఈ ఆరోపణలను పాక్ నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికాకు సహకరించింది, పాక్ సహజంగానే తీవ్రవాద వ్యతిరేకి.... అటువంటప్పుడు కోల్ కతాలో జరిగిన దాడికి పాక్ కు ఎలా సంబంధం వుంటుందని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
Comments
Story first published: Wednesday, January 23, 2002, 23:53 [IST]