న్యూయార్క్-కోల్ కతా దాడుల మధ్య లింకు!
న్యూఢిల్లీః న్యూయార్క్ నగరంపైసెప్టెంబర్ 11న జరిగిన దాడులకు, మంగళవారం ఉదయం కోల్ కతాలోని అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్ పై జరిగిన దాడికి మధ్య సంబంధం వుంది. కోల్ కతాపై జరిగిన దాడి గురించి శరవేగంతో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఈ మేరకు సమాచారంసేకరించింది. సిబిఐ ఈ సమాచారాన్ని ఎఫ్.బి.ఐ.కి అందించింది. కొద్ది నెలల కిందట కోల్ కతా కు చెందిన షూ వ్యాపారిని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బును దుబాయ్ కి చెందిన మాఫియా నాయకుడుఅందుకొని న్యూయార్క్ నగరంలో ట్విన్ టవర్స్ పైవిమానాలు కూల్చిన మహమ్మద్ అట్టాకు ఆ డబ్బు పంపాడని సిబిఐ భావిస్తున్నది. ఈవిషయాన్నే ఎఫ్.బి.ఐ.కి తెలియజేసింది.












Click it and Unblock the Notifications
