వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్డి అన్నారంలో బిజెపి జయభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః విద్యుత్‌ సంస్కరణలపై రాష్ట్రాలు నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తున్నాయంటూ ప్రధాని వాజ్‌ పేయి దుయ్యబట్టారు. విద్యుత్‌ సంస్కరణలపై ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 రాష్టాలు మాత్రమే రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పాటు చేయడం నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నదని వాజ్‌ పేయి అన్నారు. 28 రాష్ట్రాల్లో కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే కొంతవరకు విద్యుత్‌ సంస్కరణలు చేపట్టాయని, మిగిలిన రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో విద్యుత్‌ సంస్కరణలు అమలు జరగడం లేదని వాజ్‌ పేయి అన్నారు. శుక్రవారం కొత్తఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా రాజకీయాలు, బ్యూరోక్రసీ విద్యుత్‌ సంస్కరణలకు అవరోధంగా పరిణమించడం విచారకరమన్నారు.

వచ్చే పదేళ్ళలో అదనంగా మరో లక్ష మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని, అదే విధంగా పంపిణీ, సరఫరా వ్యవస్థలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ఇందుకోసం కనీసం 8 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, పబ్లిక్‌, ప్రైవేట్‌ మార్గాల ద్వారా ఈ నిధుల సమీకరణకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. విద్యుత్‌ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ తో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర, యు.పి.,గుజరాత్‌, ఢిల్లీ, కర్నాటక, హిమాచలప్రదేశ్‌ తదితర 11 రాష్ట్రాలను ప్రధాని అభినందించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X