చెన్నై: ఇంగ్లాండుతో శుక్రవారం జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా గంగూలీ మూడో వన్డే నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి.
గురువారం ఫీల్డింగ్ ప్రాక్టీస్ సందర్భంగా గంగూలీ గాయపడినట్లు కోచ్‌జాన్ రైట్ చెప్పారు. గాయం తీవ్రతను నిర్ధారించుకోవడానికి గంగూలీ ఆల్ట్రా సౌండ్ పరీక్ష చేయించుకున్నారు. ఆయన ఆడే అవకాశం వుందీ లేనిదీ శుక్రవారంనాడే తెలుస్తుందనిజాన్ రైట్ చెప్పారు. గంగూలీ ఆడకపోతే సచిన్ టెండూల్కర్ గానీ, అనిల్ కుంబ్లే గానీ జట్టుకు నాయకత్వం వహిస్తారని, అది కూడా శుక్రవారం ఉదయం మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు.