నిర్యుద్ధ సంధికి భారత్ తిరస్కరణ
న్యూఢిల్లీ: దక్షిణాసియాలో నిర్యుద్ధ సంధికి, అణ్వాయుధ నివారణకు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ చేసిన ప్రతిపాదనను భారత్ నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనల్లో నూతనత్వం ఏదీ లేదని కొట్టి పారేసింది. ముందు సీమాంతర ఉగ్రవాదాన్ని, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపేయాలని భారత్ పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది.
నిర్యుద్ధ సంధి ప్రతిపాదనపై ప్రతిస్పందిస్తూ- 1947 నుంచి కూడా పాకిస్థాన్ భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోందని ఆయన గురువారంవిలేకరులతో అన్నారు. నిర్యుద్ధ సంధి ప్రతిపాదనకు మారుగా పాకిస్థాన్ నో- టెర్రరిజం ప్రతిపాదన చేసి వుంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
