జమ్ము: జమ్మూ కాశ్మీర్ ఫూంచ్ జిల్లాలోని మండి తెహిసిల్‌లో గల ఒక పోలీసు పోస్టుపై గుర్తు తెలియనిమిలిటెంట్లు చేసిన దాడిలో ఒక ప్రత్యేక పోలీసు అధికారి మృతి చెందాడు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి తీవ్రంగా వుంది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది.
మిలిటెంట్లు గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో సతారా పోలీసు పోస్టుపై దాడి చేసింది. ఈ దాడిని పోలీసు అధికారులు తిప్పికొట్టారు.మిలిటెంట్లకు, పోలీసులకు మధ్య గంట సేపు ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తర్వాతమిలిటెంట్లు పారిపోయారు. ఈ సంఘటనలో ఎస్‌పిఒ మునీర్ హుస్సేన్ మరణించాడు. గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.