ఆంధ్ర, కర్నాటకల్లో అంధకారం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు బుధవారం మధ్యాహ్నం నుంచి సుమారు ఐదు గంటల పాటువిద్యుత్ సరఫరా నిలిచియోయింది. విజయవాడ ధర్మల్ పవర్‌స్టేషన్ - విజ్జేశ్వరం లైన్ లో వేవ్ ట్రాప్ బంపర్ తెగిపోవడంతో రాష్ట్రంలోని అన్నివిద్యుత్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దక్షిణాది గ్రిడ్ కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్నాటకలో కూడా అంధకారం అలముకుంది. ఎక్కడిరైళ్ళు అక్కడే నిలిచిపోయాయి. పరిశ్రమలలో ఉత్పత్తి స్తంభించి పోయింది. ఆస్పత్రులలో వైద్యసేవలు నిలిచిపోయాయి.
నాలుగునెలల్లో నాలుగోసారి!
గత నాలుగు నెలల్లో దక్షిణాది గ్రిడ్‌విఫలం కావడం ఇది నాలుగో సారి. కర్నాటక నిర్వాకం వల్లే తరచు దక్షిణాది గ్రిడి ఫెయిలవుతున్నదని ఆంధ్రా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కర్నాటక, ఆంధ్ర మధ్యవివాదం ఏర్పడడంతో కేంద్రంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఓవిచారణ సంఘం ఏర్పాటు చేశారు. అయినా ఫలితం శూన్యంగా కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications
