రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుండగా మేయర్ అభ్యర్థివిషయంలో మాత్రం తెలుగుదేశం ముందంజలో వుంది. రెండో రౌండ్ ముగిసే సరికి తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిచక్రవర్తి 800 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.
44 వార్డులు వున్న రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీస్వల్ప ఆధిక్యంలో వుంది. తెలుగుదేశం పార్టీ ఆరు వార్డుల్లోవిజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించారు.స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారు. వార్డుల్లో కాంగ్రెస్ హవా వుండడం, మేయర్‌విషయంలో తెలుగుదేశం హవా కొనసాగుతుండడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనేఅంచనాలు నిజం అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి.