కోల్‌కత్తా దాడి: పాస్‌పోర్టు బ్రోకర్‌అరెస్టు
పాట్నా:
కోల్‌కత్తాలోని
అమెరికాసెంటర్‌పై
దాడి
కేసులో
ప్రధాన
నిందితుడు
దుబాయ్‌కి
చెందిన
అండర్
వరల్డ్
డాన్‌ఫర్హాన్
మాలిక్
అలియాస్
అఫ్తాబ్
అన్సారీకి
పాస్‌పోర్టు
జారీలో
ప్రమేయం
వుందని
ఆరోపిస్తూ
పోలీసులు
ఒక
పాస్‌పోర్టు
బ్రోకర్‌ను,
డీలింగ్‌అసిస్టెంట్‌ను
అరెస్టు
చేశారు.
పోలీసులు సోమవారం రాత్రి నోటరీ పబ్లిక్ సురేష్ ప్రసాద్‌ను, న్యాయవాది డి. సింగ్‌ను పట్టుకున్నారు.వీరిద్దరు కూడా ఈ కేసులో నిందితులు.
పాకిస్థానీ టెర్రరిస్టు మొహమ్మద్ ఇద్రీస్ అలియాస్ మొహహ్మద్ జహీద్‌పేరు మీద జారీ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌ను గుర్తించి పోలీసులు బీహార్‌షరీఫ్‌లోని నలంద జిల్లాట్రాన్స్‌పోర్టు కార్యాలయంపై దాడి చేశారు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ నలంద డిటిఓ ఇచ్చింది. మొహమ్మద్ ఇద్రీస్‌తో పాటు అతని అనుచరుడు సలీం హజారీబాద్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
ఈ కేసులో నలందలోని బీహార్‌షరీఫ్ పోలీసుస్టేషన్‌తో సంబంధం గల రిటైర్డ్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ రాజ్ రామ్‌ను పోలీసులు భోజ్‌పూర్ జిల్లాలో ఆదివారంఅరెస్టు చేశారు.