ఖమ్మంః ఖమ్మం జిల్లా భ్రదాచలం మండలం మోదుగూరు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో30 మంది గాయపడ్డారు. వీరులో తీవ్రంగా గాయపడిని వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా వాంపల్లికి చెందిన 60 మంది కూలీలు ఓ లారీలో మోదుగూరు బయలు దేరారు.వీరు ప్రయాణిస్తున్న లారీ ఓ గోతిలో పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిలో కూడాపెద్ద సంఖ్యలో మహిళలు వున్నారు.