స్వరచక్రవర్తికిప్రముఖుల నీరాజనం
చెన్నయ్‌ఃస్వర చక్రవర్తికి తెలుగు, తమిళ సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులుఅర్పించారు. సుమారు వెయ్యి చిత్రాలకు సుస్వరాలు కూర్చిన సంగీతదర్శకుడు చక్రవర్తి ఆదివారం చెన్నయ్ లో కన్నుమూసినవిషయం విదితమే. చెన్నయ్ లో వుంటున్న పాతతరం తెలుగు నటీనటులు, శోభన్ బాబు, చంద్రమోహన్, డివిఎస్ రాజు, మనోతో పాటుటెలివిజన్ రంగ ప్రముఖులు, కమల్ హాసన్ వంటి బహుభాషా నటులు చక్రవర్తికి శ్రద్ధాంజలి ఘటించారు. చక్రవర్తి కుమారుడు ఒకరు అమెరికాలో వుంటున్నారు. మరో కుమారుడు శ్రీ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు.












Click it and Unblock the Notifications
