పాట్నాః ఉత్తరప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సొంతగా పార్టీ ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి లాలూ బయలుదేరి వెళ్లారు. మతతత్వ బిజెపికి మాత్రం ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని లాలూవిశ్వాసం వ్యక్తం చేశారు. యుపిలో కాంగ్రెస్ నేత సోనియాతో కలసి లాలూ ప్రచారం నిర్వహించనున్నారు. యుపిలో ఆయన సొంతపార్టీ ఆర్‌జెడి 25 స్థానాలకు పోటీ చేస్తున్నది. కాంగ్రెస్, ఆర్‌జెడి ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాయి.అమితాబ్ కంటే ప్రజలు తన వంటి నేతలనే ఎక్కువ ఆదరిస్తారని లాలూ చెప్పారు. సినిమా తారల ప్రచారం వల్ల ఎన్నికలు జోకులా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లీంలు యాదవులు అధికంగా వున్న అలీఘర్, మధుర ప్రాంతాల్లో లాలూపెద్దఎత్తునే ఓట్లు రాబట్టే అవకాశం వున్నదనిఅంటున్నారు.