విద్యుత్‌ పై పోరుకు హెచ్చరిక

పాట్నాః వివిధ రాష్ట్రాల్లో చట్ట సభల సమావేశాల నిడివి క్రమంగా తగ్గిపోతుండటం పట్ల లోక్‌సభ స్పీకర్‌ జిఎంసి బాలయోగి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల పనితీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన చెప్పారు. బీహార్‌ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో శుక్రవారం నాడు బాలయోగి న్యూస్‌ కాన్ఫరెన్స్‌ హాలును ప్రారంభించారు.

ఈ సందర్భంగా
మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటిపెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఏడాదికి 20,30 రోజుల కంటే ఎక్కువ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత తక్కువ సమయంలో రాష్ట్ర సమస్యలపై నిర్మాణాత్మకమైన చర్చలు జరగడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టసభలు సమర్ధంగా పనిచేయని పక్షంలో మౌలిక సదుపాయాలువిస్తరించినా ప్రయోజనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 1993-97 మధ్య ఎనిమిది రాష్ట్రాల్లో చట్టసభలు సగటున 20 రోజుల కంటే తక్కువ కాలం సమావేశమయ్యాయని ఆయనవివరించారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటిపెద్ద రాష్ట్రాల అసెంబ్లీలు ఏడాదికి కనీసం 90 రోజులు సమావేశం కావాలని సూచించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+