వాజ్ పేయితో రష్యాఉపప్రధాని భేటీ
న్యూఢిల్లీః ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరుకు రష్యా పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్ లో పర్యటిస్తున్న రష్యా ఉప ప్రధాని క్లెవనోవ్ శుక్రవారం ఉదయం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు తీవ్రవాదం తదితర సమస్యలను కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తీవ్రవాద నిర్మూలనకు భారత్ అవలంబిస్తున్న వైఖరిని క్లెవనోవ్ ప్రశంసించారు. భారత్ కోరిన 20 మంది తీవ్రవాదుల్ని పాకిస్తాన్‌అప్పగించాలని, తద్వారా చర్చలకు మార్గం సుగమం చేయాలని ఆయనకోరారు.












Click it and Unblock the Notifications
