ములాయం కోసం ఆడిపాడుతున్నఅమితాబ్
లక్నొః సూపర్ స్టార్‌అమితాబ్ బచ్చన్ శనివారం లక్నోలో కలకలం సృష్టించారు. ప్రధాని వాజ్‌పేయి సొంత నియోజకవర్గమైన లక్నోలో సమాజ్ వాది పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. సమాజ్ వాది పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో మాత్రమే పాల్గొంటున్నానని, ప్రచారం చేయడంలేదనిఅమితాబ్ చెప్పుకుంటున్నప్పటికీ ఆయన ప్రచార సభల్లో బహిరంగంగా పాల్గొంటున్నారు. లక్నోలో శనివారం జరిగిన బహిరంగ సభలోఅమితాబ్ ములాయం సింగ్, అమర్ సింగ్ లను ఆకాశానికి ఎత్తేశారు. దేశానికి ములాయం వంటి వారు అవసరం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications