తన 93 ఏళ్ల తాతయ్యకు ఉపాసన అరుదైన కానుక.. అయోధ్య రామ శిల్పితో.. ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన 93 ఏళ్ల తాతయ్య, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి అరుదైన కానుకను అందించారు ఉపాసన. ఆయన శ్రీరాముడికి పరమ భక్తుడని తెలుసుకున్న ఉపాసన.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన రామలల్లా విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ను సంప్రదించారు. ఆయన చేతుల మీదుగా రూపొందించిన శ్రీ రాముడి విగ్రహాన్ని తన తాతయ్యకు గిఫ్ట్ గా అందించి ఆయనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

ఉపాసన సూచించిన వివరాల ఆధారంగా శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీ రాముడి విగ్రహాన్ని అత్యంత సుందరంగా చెక్కారు. ఈ విగ్రహాన్ని ఉపాసన ఏడాది క్రితమే తన తాతయ్య కోసం ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని రూపొందించడం పూర్తి కావడంతో ఆమె దీనిని అందుకున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంతో నియమ నిష్టలతో ఈ విగ్రహాన్ని మలిచారు. ఇక ప్రతాప్ రెడ్డికి రామాయణంలోని సుందరకాండ పారాయణం చాలా ఇష్టమట. ఆయన ప్రతిరోజూ సుందరకాండను పారాయణం చేయడం చూసిన ఉపాసన తాను కూడా సుందరకాండను పారాయణం చేశారు. అలా 21 రోజులకు సుందరాకాండ పారాయణం పూర్తయిన రోజే విగ్రహం ఇంటికి చేరుకోవడంతో ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.
Jai Shri Ram! 🙏With more than 3,000 hours of dedication, devotion, and hard work, we are completing and offering this beautiful idol of Lord Shri Rama.My heartfelt gratitude to Upasana Madam for giving me this wonderful opportunity to create this divine sculpture.Our ancestors created magnificent temples and sculptures that are beyond our imagination. Preserving this priceless heritage and passing it on to future generations is our collective responsibility.As sculptors, it is our duty to carry forward this great tradition with dedication and sincerity.Jai Shri Ram! Wishing everyone a very Happy Deepavali! 🪔
— Arun Yogiraj (@yogiraj_arun) November 8, 2026
ఇక ఇదే విషయంపై శిల్పి అరుణ్ యోగిరాజ్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు. " జై శ్రీరామ్.. 3వేల గంటలకు పైగా నియమ నిష్టలతో, నిరంతర శ్రమతో మేము ఈ అద్భుతమైన శ్రీ రాముడి విగ్రహాన్ని రూపొందించి ఇవ్వబోతున్నాము. మా పూర్వికులు అద్భుతమైన కళా కృతితో ఆలయాలను నిర్మించారు. విగ్రహాలను చెక్కారు. అవన్నీ ఊహకు మించినంతగా ఉన్నాయి. అయితే ఈ సంప్రదాయాన్ని కొనసాగించి.. భావి తరాలకు అందించడం మన కర్తవ్యం. ఓ శిల్పిగా ఈ కల్చర్ ను ముందు తరాలకు అందించడం బాధ్యతగా భావిస్తున్నాను. జై శ్రీరామ్.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications
