ఏపీ ఉద్యోగులకు అలర్ట్..! పీఆర్సీ ఇచ్చే వరకూ వీటన్నింటికీ బ్రేక్..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఓ అలర్ట్. రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణలపై 12వ పీఆర్సీ కమిషన్ అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ అధ్యయనంపై ప్రభావం పడకుండా పలు రెగ్యులర్ పనులకు బ్రేక్ వేసింది. ఇందులో కొత్త పోస్టుల సృష్టి, హోదాల మార్పులు, ఉన్న పోస్టుల అప్ గ్రేడ్ ఇలా పలు అంశాలున్నాయి. పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకూ వీటిని చేపట్టకుండా ప్రభుత్వం (AP Govt) నిషేధం విధించింది. ఈ మేరకు ఆర్దిక శాఖ సర్కులర్ జారీ చేసింది.

అవకాశాల కల్పనలో ఏపీ భేష్- ఈక్వాలిటీ ఇండెక్స్ లో రెండో ర్యాంక్ పై చంద్రబాబు..!
అవకాశాల కల్పనలో ఏపీ భేష్- ఈక్వాలిటీ ఇండెక్స్ లో రెండో ర్యాంక్ పై చంద్రబాబు..!

12వ పీఆర్సీ సిఫార్సులు సమర్పించి, వాటిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకూ కొత్త పోస్టుల సృష్టి, ఉన్న పోస్టుల అప్ గ్రేడ్, రీ-డిజిగ్నేషన్, గెజిటెడ్ హోదా కల్పన వంటి ప్రతిపాదనలను వాయిదా వేయాలని అన్ని శాఖల్ని ఆర్ధిక శాఖ ఆదేశించింది. ఈ సర్కులర్ ను అన్ని సచివాలయ శాఖలు, ప్రభుత్వ శాఖాధిపతులకు పంపింది. ఈ నిర్ణయం వెనుక కీలక కారణం ఉంది. ప్రస్తుతం పీఆర్సీ అధ్యయనం నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కొత్త పోస్టుల ఏర్పాటు, అప్ గ్రేడేషన్, రీడిజిగ్నేషన్, గెజిటెడ్ హోదా కల్పనపై ఆర్ధిక శాఖకు పలు ప్రతిపాదనలు అందుతున్నాయి. కానీ వాటిపై పీఆర్సీ అధ్యయనం పూర్తయ్యే వరకూ నిర్ణయం తీసుకునే పరిస్దితి లేదు. అందుకే వీటిని వాయిదా వేయాలని ఆదేశించింది.

AP Govt Freezes Creation of New Posts Promotions and Gazetted Status Changes During 12th PRC Tenure
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!

పీఆర్సీ అధ్యయనం సాగుతున్న తరుణంలో ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల దీనిపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వివిధ కేటగిరీల మధ్య వేతన సమానత్వం, పోస్టుల మధ్య పోలికల నిర్ణయంలో పీఆర్సీకి ఇబ్బందులు తప్పవని భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే పీఆర్సీ కాలంలో మార్పులు చేస్తే అవి కమిషన్ సిఫార్సుల్లో ప్రతిబింబించకపోవచ్చని, తద్వారా వేతన సవరణలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే సాధారణ నియామకాల నిలిపివేత లేదా ఇప్పటికే ఉన్న ఉద్యోగుల సాధారణ ప్రమోషన్ల నిలిపివేత మాత్రం ఇందులో లేదు. 12 పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాన్ని తర్వాత సమీక్షిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+