కాందహార్‌ః తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ముల్లా అబ్దుల్ వకీల్ ముత్తావకీల్ అమెరికన్ బలగాల ముందు లొంగిపోయారు. అమెరికా బలప్రయోగంతో కూలదోసిన తాలిబన్ ప్రభుత్వంలో ముత్తా వకీల్ సీనియర్ నాయకుడు.
తాలిబన్‌ప్రభుత్వానికి సంబంధించి అంతటి సీనియర్‌నేత అమెరికాకు లొంగిపోవడం అఎn్గాన్‌లో ఇదేమొదటిసారి. తాలిబన్ల అగ్రనేత ముల్లా ఒమర్‌కుముత్తా వకీల్ అత్యంత సన్నిహితుడు. ఆయన్నుఅమెరికా సైనికాధికారులు, ఇంటలీజెన్స్ అధికారులుప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది.