వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణుపరీక్ష జరిపిన భారత్‌ః ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః భారతదేశం ఇటీవల రహస్యంగా అణుపరీక్ష నిర్వహించిందని పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ ఆరోపించారు. ఇటీవల క్షిపణి పరీక్ష నిర్వహించిన భారత్‌అదేసమయంలో పాకిస్తాన్‌ ను రెచ్చగొట్టేందుకుఅణుపరీక్ష నిర్వహించిందని వాషింగ్టన్‌లో జరిగిన ఓకార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ముషారఫ్‌ ఐఎంఎఫ్‌ ఉన్నతాధికారులను కలుసుకున్నారు. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవహారాలపై ముషారఫ్‌ వారితో చర్చించారు. బుధవారం ఆయన అమెరికా అధ్యక్షుడు బుష్‌ ను కలుసుకుంటారు. భారత్‌ - పాక్‌ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దరిమిలా ముషారఫ్‌ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇందుకు సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు తన వద్ద లేనప్పటికీ కీలకమైన సమాచారం మాత్రం తన వద్ద వున్నదని ముషారఫ్‌ అన్నారు. ఆ సమచారాన్ని అమెరికాకుఅందజేస్తానని చెప్పారు.

ముషారఫ్‌ మాటలు నమ్మలేంఃఅమెరికా
వాషింగ్టన్‌ః భారత్‌ అణుపరీక్షలు నిర్వహించిందంటూ పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అమెరికా వ్యాఖ్యానించింది. ముషారఫ్‌ ఈ మేరకు చేసిన ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. 1998 తరువాత భారతదేశం ఎటువంటి అణుపరీక్షలు జరపలేదనే మా నమ్మకం. భారత, పాకిస్తాన్‌ లు మళ్ళీ అటువంటి చర్యలకు పాల్పడవనే ఆశిస్తున్నాం అని బుష్‌ ప్రభుత్వంలోనిసీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ చేసిన వ్యాఖ్యలపై తగిన ఆధారాలు లేవని కూడా అమెరికా వ్యాఖ్యానించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X