ముంబాయిః విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్‌లో 25 శాతం వాటాను కైవసం చేసుకున్న టాటా సంస్థ బుధవారం నాడు ఆ సంస్థ యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకున్నది. 1439 కోట్ల రూపాయలతో ఈ వాటాలను టాటాలు కొనుగోలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంతో వాటాదారుల ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత పునర్‌వ్యవస్థీకరించినవిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్‌గా రతన్‌టాటా బాధ్యతలుస్వీకరించారు. విఎన్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలను చేపట్టమని ఆయన హామీ ఇచ్చారు.విఎస్‌ఎన్‌ఎల్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఇప్పుడు దానిని తమ గ్రూప్‌లోని ఇతర టెలీకామ్ కంపెనీలతో సమస్యలు లేకుండా ఇంటిగ్రేట్ చేయడంపై దృష్టి సారిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.