తొలిరాజు షరా మామూలే

హైదరాబాద్‌ః శుక్రవారం నాడు రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ఎప్పటిలాగానే ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి.ఉదయం తొమ్మిది కల్లా పలువురు ఎమ్మెల్యేలు సమావేశాల హాలులోకి చేరుకున్నారు. తెలుగుదేశం సభ్యులంతా చాలా ఏళ్ల తర్వాత పసుపు పచ్చ కండువాలను ధరించడంవిశేషం.

దేశం విప్‌ గద్దె బాబూరావు, ఎమ్మెల్యేశ్రీరామ భద్రయ్యలు ఎన్‌టిఆర్‌ తరహాలో పార్టీ కండువాను తలకు రుమాలుగా చుట్టుకుని సభకుహాజరయ్యారు. అందరికంటే మొదట కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలుఎస్వీ సుబ్బారెడ్డి, బైరెడ్డి రాజశేకర్‌రెడ్డిహాలులోకి ప్రవేశించారు. మంత్రుల్లో చిన్న నీటి పారుదల శాఖ మంత్రి కెఇ ప్రభాకర్‌ తన స్థానం వద్దకు వెళ్లి గవర్నర్‌ ప్రసంగాన్ని పరశీలిస్తూ వుండిపోయారు. మరో మంత్రి కడియం మాత్రం ద్వారం దగ్గరే నిలబడి కాసేపు మహిళా ఎమ్మెల్యేలతో జోకులు వేశారు. తొమ్మిదిన్నర ప్రాంతంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుహాలులోకి ప్రవేశించగానే ప్రతిపక్ష నాయకుల స్థానాల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. వైఎస్‌, ఇంద్రసేనారెడ్డి, నోముల నర్సింహయ్య,అసదుద్దీన్‌ ఒవైసీ, కె చంద్రశేఖర్‌రావులతో ముఖ్యమంత్రి కరచాలనంచేశారు. సమావేశం ప్రారంభానికి ముందు స్పీకర్‌ ఇచ్చినవిందుకు సభాలోని వివిధ పార్టీల నేతలుహాజరయ్యారు. ఈ సారి సమావేశాల సందర్భంగా అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+