ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ మాదే: వాజ్‌పేయి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), దాని మిత్ర పక్షాలు మెజారిటీ సాధించగలవని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి విశ్వాసం వ్యక్తం చేశారు. మెజారిటీ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, మెజారిటీ సాధించగలమనే నమ్మకం ఉన్నదని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ మాటలపై తమకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు. భారత్‌ అణుపరీక్షలు నిర్వహిస్తోందని ముషారఫ్‌ అనడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆ మాట అన్నారు. తీవ్రవాదాన్నిపెంచి పోషిస్తున్న పర్వేజ్‌ ముషారఫ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయనవిమర్శించారు.

అయోధ్య వివాదానికి మార్చి 15వ తేదీ లోగా పరిష్కారం కనుక్కుంటామనేవిషయంపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. వివాద పరిష్కారం తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోనే దాగి వుండవచ్చునని, పాకిస్థాన్‌ తీవ్రవాదులకు సురక్షిత స్థావరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+