కోస్గిః మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం నాచారం గ్రామ శివార్లలో బోరుబావిలో పడిపోయిన బాలున్ని ప్రాణాలతో రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదివారం వేకువ జామున బోరుబావి నుంచి బాలుని మృతదేహాన్ని వెలికి తీశారు.
11 ఏళ్ల బాలుడు రామచంద్రయ్య గురువారం ఉదయం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయినవిషయం విదితమే. బోరుబావికి సమాంతరంగా మరో ఓపెన్ వెల్‌ను తవ్వి ఆ బావినుంచి బోరు బావికి సొరంగం తవ్వుతుండగా బోరు గుంతనుంచి రక్తం కలిసిన నీరు విపరీతంగా దుర్వాసన వచ్చాయి. దాంతో బాలుడు మరణించి వుంటాడనే నిర్ధారణకువచ్చారు. దుర్వాసన కారణంగా పనులను నిలిపివేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది నిర్ణయించనప్పటికీ సంఘటన స్థలంలోనే వున్న మంత్రి నాగం జనార్ధనరెడ్డి, జిల్లా కలెక్టర్ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు సొరంగం పూర్తిగా తవ్వారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వున్న శవాన్నిఅగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మూడ రోజులు శ్రమించినప్పటికీ బాలున్ని కాపాడలేకపోవడంతో ఇక్కడ వాతావరణంవిషాదకరంగా మారింది. బాలుని తల్లితండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరితరమూ కావడం లేదు.