మాడ్రిడ్ ః పాకిస్తాన్ కాశ్మీర్ లేదా మరో సమస్య కారణంగా కాకుండా భారత్‌తో అనివార్యమైన శత్రుత్వ వైఖరిని అవలంభిస్తున్నదని భారత విదేశాంగ మంత్రి యశ్వంత్‌సిన్హా ఆరోపించారు.
భారత్‌తో దీర్ఘకాలికంగా ఏలాంటి సంబంధాలను పాకిస్తాన్ కోరుకుంటున్నదో స్పష్టం చేయాలని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసేవరకు పాకిస్తాన్‌తో మాటాముచ్చటకు భారత్ మాత్రం దూరంగా వుంటుందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ నేత ముషారఫ్‌కు కితాబు నిస్తున్న పశ్చిమదేశాల మేధావి వర్గం గతంలో కూడా పాకిస్తాన్‌సైనిక పాలకులకు అలాంటి కితాబులనే ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా జర్నలిస్టును కిడ్నాప్ చేసే వరకుబ్రిటీష్ జాతీయుడైన ఇస్లామిక్ ఉగ్రవాది ఒమర్‌షేక్ పాకిస్తాన్‌లో హాయిగా వున్నాడని ఇలాంటి శక్తులకు ఆశ్రయమిచ్చే పాకిస్తాన్ ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు.