పోలీసు దౌర్జన్యాలపై దద్ధరిల్లిన సభ
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యాలపై సోమవారం శాసనసభ సోమవారం దద్ధరిల్లింది. పోలీసుల దౌర్జన్యాలకు బాధ్యత వహించి హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
దళితుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలుగుదేశం సభ్యుడు జైపాల్ యాదవ్ అన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. తెలుగుదేశం సభ్యుడుప్రభుత్వ సమాధానం ఇస్తే ఎలా అని ప్రతిపక్ష సభ్యులు అడిగారు. దాంతో అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ మేయర్ హరీశ్వర్ రెడ్డి జైపాల్ యాదవ్ మైక్ కట్ చేశారు.
పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని రావుల రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసులను అదుపు చేయలేకపోతోందనిఅసదుద్దీన్ ఓవైసీ (మజ్లీస్) విమర్శించారు. పోలీసుల దౌర్జన్యాలను అదుపు చేయకపోతే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని నోముల నర్సింహయ్య వ్యాఖ్యానించారు.
మైసిగండి, కొత్తూరు సంఘటనలకు బాధ్యులయినవారిపై చర్యలు తీసుకుంటున్నామని, పోలీసు వ్యవస్థలో మార్పులకుశ్రీకారం చుట్టామని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. మంత్రి సమాధానానికి కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. రాష్ట్రంలో దళితులను రక్షించే బాధ్యత తమదేనని, అయితే, బెదిరింపుల ద్వారా ప్రతిపక్షాలు ఒక మంత్రిని మాట్లాడకుండా చేస్తామంటే కుదరదని ఒకానొక సందర్భంలో మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications
