ఎక్స్‌గ్రేషియాకుతిరస్కారం
న్యూఢిల్లీః అక్రమ భవన నిర్మాణాల అరాచకత్వానికి ఢిల్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణ అని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తుండటం వల్ల ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఎన్ని సార్లు సంబంధిత శాఖల అధికారులకుఆదేశాలు ఇచ్చినా వారిలో పరివర్తన కానరాలేదని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని లాల్దొరా ప్రాంతానికి భవన నిర్మాణ బైలాస్‌ను విస్తరించలేదంటూ దాఖలైన ఓ దరఖాస్తుపై విచారణ సందర్భంగా జస్టిస్ బిఎన్ కృపాల్, జస్టిస్ శివరాజ్ పాటిల్, జస్టిస్ బిపి సింగ్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications
