వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ నిర్మాణాలపై సుప్రీం ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అక్రమ భవన నిర్మాణాల అరాచకత్వానికి ఢిల్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణ అని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తుండటం వల్ల ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఎన్ని సార్లు సంబంధిత శాఖల అధికారులకుఆదేశాలు ఇచ్చినా వారిలో పరివర్తన కానరాలేదని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని లాల్దొరా ప్రాంతానికి భవన నిర్మాణ బైలాస్‌ను విస్తరించలేదంటూ దాఖలైన ఓ దరఖాస్తుపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బిఎన్‌ కృపాల్‌, జస్టిస్‌ శివరాజ్‌ పాటిల్‌, జస్టిస్‌ బిపి సింగ్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

రాజధానిలో భవన నిర్మాణాలకు సంబంధించి ఏ చట్టాన్ని అనుసరిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించింది. ఢిల్లీ అనుసరిస్తున్న భవన నిర్మాణ చట్టాలను చుట్టుపక్కాల గ్రామాల్లో అమలు చేయలేకపోవడానికి తమకు కారణం కనిపించడం లేదని వారు అన్నారు. ఈ చట్టాలు లేకపోవడంతో పరిసరగ్రామాల్లో విచ్చలవిడిగా భవనాలను నిర్మిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిథిలోకి తెచ్చినా తేకున్నా లాల్దోరా వంటి ప్రాంతాల్లో నిబంధనలన్నీ అమలవుతాయని న్యాయమూర్తు అన్నారు. అన్ని వివరాలతో కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X