లాడెన్ కోసం కాశ్మీర్ లో వేట!
లండన్‌ః అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ కోసం కాశ్మీర్ లో ముమ్మంరంగా గాలింపు జరుపుతున్నట్లు లండన్ కు చెందిన ఓ దినపత్రిక వెల్లడించింది. లాడెన్ కాశ్మీర్ లో వున్నాడనే సమాచారంఅందడంతో అంతర్జాతీయ దళాలు గాలింపు చేపట్టాయనేది ఆ పత్రిక కథనం. లాడెన్ అనుచరుల వద్ద అత్యంత అధునాతన ఆయుధాలు కూడా వున్నట్లు సమాచారంఅందడంతో హిందూమహాసమద్రంలో వున్న నౌకల నుంచి ఉపగ్రహసేవల్ని కూడా ఉపయోగించు కుంటున్నాయని ఆ పత్రిక తెలిపింది. లాడెన్ కు కాశ్మీర్ లోని కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థల ఊతం ఇస్తున్నాయని కూడా ఆ పత్రిక స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
