హైదరాబాద్‌ః హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డెరెక్టర్ జనరల్‌గా వున్న ఎంవి కృష్ణారావు నియమితులయ్యారు.
ఆయనతో పాటు పోలీసు గృహ నిర్మాణ సంస్థ మానేజింగ్ డైరెక్టర్‌గా వున్న గౌతంకుమార్‌నువిజిలెన్స్ అడిషనల్ డిజిగా నియమించారు. పోలీసు అకాడెమి డైరెక్టర్ ఎకె మహంతిని ఎసిబి అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. కె సదాశివరావునుఫైర్ సర్వీసెస్ డిజిగా బదిలీ చేశారు. డిజిపి రాములు కోరిక మేరకు కుమావత్‌ను డిజి (శాంతిభద్రతలు)గా కొనసాగించాలని నిర్ణయించారు.