మంచి మిత్రుడ్ని కోల్పోయాః బాబు
న్యూఢిల్లీః లోక్ సభ్ స్పీకర్ బాలయోగి హఠాన్మరణం యావత్ భారతావనిలో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. ప్రతిపక్ష, అధికారపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు బాలయోగికి శ్రద్ధాంజలి ఘటించారు.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఉజ్వల భవిష్యత్తు వున్న బాలయోగి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం.
- పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ.
హుందాతనంతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే బాలయోగి వన్నె తెచ్చారు. క్రమశిక్షణ తప్పిన వారు ఏ రాజకీయ పార్టీ వారైనా ఆయన సహించేవారు కాదు. వివిధ రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడంలో ఆయనకు ఆయనే సాటి.
- కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు బాలయోగి చేసినసేవలు మరువలేనివి.
- మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్
భారత దేశం ఓ గొప్ప దళిత నాయకుడ్ని కోల్పోయింది.
- బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్