చెమ్మగిల్లని నయనమ్ములేదు........
అమలాపురంః కోనసీమ కన్నీరు మున్నీరైంది. బాలయోగి ఇకలేరనే వార్తతో నిర్ఘాంతోపోయిన కోనసీమ ఆ షాక్ నుంచి తేరుకొని ఇప్పుడు భోరుమంటున్నది. అమలాపురం, రాజోలు, రావులపాలెం, ముమ్మిడివరం,అంబాజిపేటల్లో సోమవారం ఎవరిని కదిలించినా కన్నీళ్ళతోనే బదులిచ్చారు. వ్యాపారులంతాస్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రతి కూడలిలో బాలయోగి ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ళు సోమవారం నల్లజెండాలు, బాలయోగి ఫోటోలు దర్శనం ఇచ్చాయి.
ఎదురులంక శివారులోని బాలయోగి ఇల్లు ఆయనఅక్క, బావలు, బంధువుల రోదనలతో విలవిలలాడిపోతున్నది.












Click it and Unblock the Notifications
