కృషి వెంకటేశ్వరరావు సోదరిఅరెస్టు
విజయవాడః కృషి బ్యాంక్ చైర్మన్ వెంకటేశ్వరరావు సోదరి, ఆ బ్యాంక్ డైరెకర్లలో ఒకరైన సునీతను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కృషి బ్యాంక్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి అదృశ్యం అయిన సునీత ఇన్నాళ్ళూ విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ లో తలదాచుకున్నారు. ఈమెపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. సోమవారం తమకు అందిన ముఖ్యమైన సమాచారం మేరకు అపార్ట్ మెంటుపై దాడి చేసి సునీతను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. కృషిబ్యాంక్ లో తాను నామమాత్రం డైరెక్టర్ ను అని, చాలాకాలంగా తన సోదరునితో సంబంధాలు కూడా లేవని సునీత పోలీసులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
