ప్రుడెన్షియల్‌బ్యాంక్ ఇన్వెస్టర్ల గగ్గోలు
హైదరాబాద్‌ః కృషి, శ్రావ్య, చార్మినార్ బ్యాంక్ లు బోర్డులు తిప్పేయడంతో గుండెలు అరచేతిలో పట్టుకొని వున్న సహకార బ్యాంకు ఇన్వెస్టర్లు శనివారం మరో సారి ఉలిక్కిపడ్డారు. జంటనగరాల్లో అతి పెద్దదైన ప్రుడెన్షియల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఖాయిలా మార్గంలో వున్నదంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. దీంతో నగరంలోని ఆ బ్యాంక్ కు చెందిన 18 శాఖల వద్ద ఇన్వెస్టర్లు ఆందోళన చేపట్టారు. పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజానిజాలెంత అని అధికారులను నిలదీశారు.
సహకారం బ్యాంకులన్నీ మధ్యతరగతి ఇన్వెస్టర్లకు షాక్‌మీద షాక్ ఇస్తున్న తరుణంలో ఆ కో ఆపరేటివ్ అధికారి ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేయడం పట్ల ఇన్వెస్టర్లు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications
