వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూష కేసులో సిద్దార్ధరెడ్డి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సినీనటి ప్రత్యూష హత్యకేసువిచారణ చేపట్టిన సి.బి.ఐ. శనివారం తొలి అడుగు వేసింది. ప్రత్యూష ప్రియుడు సిద్దార్ధరెడ్డిని శనివారం సాయంత్రం కేర్‌ ఆస్పత్రి నుంచిఅరెస్టు చేసింది. ప్రత్యూషతో పాటు ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి కేర్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సిద్దార్ధరెడ్డిపై సిబిఐ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. ఆత్మహత్యా ప్రయత్నం, ఆత్మహత్యకు ప్రోత్సహించడం, హత్య కేసులను సిబిఐ సిద్దార్ధరెడ్డిపై నమోదు చేసింది.

గత నెల 23న ప్రత్యూష, సిద్దార్ధరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో ప్రత్యూష అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందినవిషయం విదితమే. గత 15 రోజులుగా ఆస్పత్రిలో వున్న సిద్దార్ధరెడ్డిని సిబిఐ పోలీసులుఅరెస్టు చేయడంతో ఈ కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అన్నివర్గాల వత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకిఅప్పగించింది.

సంఘటన జరిగిన రెండు వారాల తరువాత సిద్దార్ధరెడ్డినిఅరెస్టు చేయడం విశేషం. సిద్దార్ధ రెడ్డిని సోమవారం 9న మెట్రొపొలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుటహాజరు పరుస్తారు. ప్రత్యూష కేసును సిబిఐకి అప్పగించిన రెండో రోజనే సిబిఐ సిద్దార్థరెడ్డినిఅరెస్టు చేయడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X