దేశవ్యాప్తంగా 20 వేల మందిఅరెస్టు
న్యూఢిల్లీః అయోధ్యలో రామశిలాదాన్ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ప్రయత్నించిన రామసేవకులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా హింసాత్మక సంఘటలు జరిగినట్టుగా వార్తలు రాలేదు. మహారాష్ట్రలోనే సుమారు పదివేల మంది అరెస్టయినట్టుగా అధికారులు ప్రకటించారు. ముంబాయిలో 8000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని రెండువేల ఆలయాల్లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామసేవకులను పోలీసులు మధ్యలోనే అడ్డుకునిఅరెస్టు చేశారు. ఇదిలా వుండగా అయోధ్యలో శిలాదాన్ కార్యక్రమం ముగిసిన తర్వాత వందమంది రామసేవకులు హఠాత్తుగావివాదాస్పద స్థలంలోని తాత్కాలిక రామాలయం దిశగా దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసు బలగాలు వెంటనే లాఠీచార్జీ జరిపి వారిని చెదరగొట్టాయి.












Click it and Unblock the Notifications
