ప్రత్యూషది హత్యేనని నిరూపిస్తా
గుంటూరు: సినీ నటి ప్రత్యూష మరణాన్ని స్టాటిస్టిక్స్ పద్ధతుల్లో హత్యగా నిరూపించగలనని నాగార్జునవిశ్వవిద్యాలయం స్టాటస్టిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జి.వి.యస్.ఆర్. ఆంజనేయులుఅంటున్నారు. ప్రత్యూష మరణం గురించి ప్రొఫెసర్ ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలను ఒక తెలుగు దిన పత్రిక ప్రచురించింది.
గణాంక శాస్త్రంలో టైప్-1, టైప్-2 ఎర్రర్‌లుగా పిలిచే రెండు రకాలవిశ్లేషణల ఆధారంగా ప్రత్యూషది హత్యేనని నిర్ధారించవచ్చునని ఆయన అన్నారు. భౌతికంగా వున్న ఆధారాలను మాయం చేయడానికి కేర్ ఆస్పత్రి తగిన సమయం తీసుకున్నదనేది తనవిశ్లేషణలో వెల్లడయిందని ఆయన అన్నారు. ప్రత్యూష వాంతి చేసుకున్నప్పుడు వెలువడిన పదార్థాలనుసేకరించిన కేర్ వైద్య బృందం ఆమె దుస్తులను పారేశామని చెప్పుతోందని, ఇది మెడికో లీగల్ కేసు ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. ఈ చర్య కేర్ ఆస్పత్రి ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఆయనవిమర్శించారు.
లాజికల్ డిడక్షన్ ప్రకారం, వివిధ మీడియాల్లో వచ్చిన వార్తా కథనాలనుసేకరించిన అంశాల ఆధారంగా విశ్లేషణ నిర్వహించిన ఆంజనేయులు టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ మెథడ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. తప్పుడు హైపోథసిస్‌ను అంగీకరించడం,అందులోని వాస్తవాలను నిరాకరించడం కూడా టైప్-1, టైప్-2 ఎర్రర్‌ల కింద పరిగణలోకి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
