ప్రమాదాల నివారణకు హైవే అథారిటీ
హైదరాబాద్: జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు హైవే అథారిటీని ఏర్పాటు చేస్తామని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల పట్ల సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనకు ఆయన మంగళవారం శాసనసభలో సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు.
హైవే అథారిటీ బిల్లు ముసాయిదాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది లోగా హైవే అథారిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల మీద ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటన్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
